Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ ఉపాధ్యక్షులు భీంరెడ్డి
- కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-కుల్కచర్ల
రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, వంటనూనె, విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డీసీసీ ఉపాధ్యక్షులు బోలుసని భీంరెడ్డి , కాంగ్రెస్ బ్లాక్ 2 అధ్యక్షుడు కర్రే భరత్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆంజనేయులు ముది రాజ్ అన్నారు. గురువారం కుల్కచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేప ట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లా డుతూ.. బీజేపీ ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు దినదినం పెరుగుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగు దలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారన్నారు. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం పేదవారిని మరింత ఇబ్బందులకు గురి చేసే విధంగా విద్యుత్ ధరలు పెంచిందన్నారు.యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగా సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిపాలన సాగించారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అంజిలయ్య గౌడ్ , జిల్లా ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య , మండల మాజీ అధ్యక్షులు వెంకటయ్య గౌడ్, స్థానిక ఎంపీటీసీ ఆనందం ముది రాజ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు రాంచందర్ నాయక్, జంగయ్య, వెంకటయ్య, వెంకట్రాములు, వెంకట్, నర్సింలు, హమ్మయ్య, రాములు, కృష్ణయ్య, భాస్కర్, శర్పద్దిన్, బాల్రాజ్, గోపాల్ నాయక్, వార్డు సభ్యులు వెంకటేష్, అంజనేయులు పాల్గొన్నారు.