Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్లో పనిచేస్తున్న సిబ్బంది చైర్మన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కోర్టుకు వెళ్తాం
- మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమల్
నవతెలంగాణ-తాండూరు
తాండూరు మున్సిపల్లో కొనసాగుతున్న రాజకీయ డ్రామాలు కోర్టులో ఉన్న కేసులను వెనక్కి తీసుకోవాలని నలుగురు కౌన్సిలర్లు, నలుగురు మున్సిపల్ సిబ్బంది రాద్ధాంతం చేయడం సిగ్గుచేటని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. తాండూరు మున్సిపల్లో తనకు జరుగుతున్న అన్యాయానికి, తన హక్కులను రక్షిం చుకునేందుకు కోర్టుకు వెళ్లడం జరిగింది తప్ప మరి ఇతర విషయాల మీద వీళ్ళ లేదని ఈ సందర్భంగా తెలియజే శారు. బడ్జెట్ సమావేశాలు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. గతంలో చించి పారేసిన బడ్జెట్లోనే ప్రస్తుతం పనులు ప్రారంభించినా విషయాలను గుర్తుంచుకోవాల న్నారు. నలుగురు కౌన్సిలర్లు శ్రీనివాస్ రెడ్డి, సోమశేఖర్, ప్రభాకర్ గౌడ్, ఆసిఫ్‌లు మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారిపై కోర్టులో పరువు నష్టం దావా కేసు వేస్తామన్నారు. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఈ ఖాజా, శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ల్ పై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌పై సిబ్బంది ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. మున్సిపల్ లో ఇన్చార్జి పాలనలో పట్టణ ప్రగతి కుంభకోణం, హరిత హారం కుంభకోణం జరిగిందన్నారు. పెండిం గ్ అప్రూవల్ లేకుండా బిల్లులు చెల్లించడం ఎంతవరకు సమం జసమన్నారు. మున్సిపల్ నూతన భవనం ప్రారంభం లో 15 లక్షలు ఎందుకు ఖర్చు అవుతాయని ప్రశ్నించారు. ప్రారంభోత్సవానికి అద్దె చెట్లు తీసుకురావడం సిగ్గుచేటన్నారు. తాండూర్‌లో కొనసాగిన అక్రమ వెంచర్లు పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మున్సిపల్ లో 18 మంది లేబర్ కి సంబంధించిన మదర్ ఫైల్ లేకపోవడం సిగ్గుచేటన్నారు. అయినా వారికి జీతాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏడు మంది ఉద్యోగుల నుండి 12 లక్షలు లంచం ఎవ్వరూ తీసుకున్నారో తమకు తెలుసనని తెలిపారు. టీఆర్ఎస్ అంతర్గత విషయాలు ఇతర పార్టీల కౌన్సిలర్లకు ఏమి అవసరమన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చెప్పేవరకు సీటు నుండి దిగేది లేదన్నారు. తమపై అవినీతి అక్రమాలు ఉంటే రుజువు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆరోపణలు చేస్తున్న వారికి సవాలు చేశారు. కొందరు గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అన్నారు. మున్సిపల్లో కొందరు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అందరి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరి చిట్టా త్వరలో ఇప్పుతామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పరిమళ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.