Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
ఆదివారం పరిగి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బార్సు నెంబర్ వన్లో 1991-1992 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి బోధించిన ఉపాధ్యాయులు శివయ్య, కృష్ణయ్య, బాలకృష్ణారెడ్డి, జనార్ధరెడ్డి, చిన్నారెడ్డి, నర్సిరెడ్డి, యాకూబ్అలీని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ చదువు అనేది అందరికి ముఖ్యమని అన్నారు. గురువులు చెప్పిన మార్గంలో నడిచిన అందుకే మనం ఈ స్థాయిలో ఉన్నామని గుర్తు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ మారుతున్న యాంత్రిక జీవనంలో విద్యారంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు. టీఆర్ఆర్ విద్యా సంస్థల ద్వారా మంచి విద్యను అందించి ఎంతోమందిని తీర్చిదిద్దామని తెలిపారు. కనుక మన పిల్లలకు విద్యపై అవగాహన కల్పించి సన్మార్గంలో నడిచే విధంగా చూడాలని కోరారు. మన ప్రాంతం నుండి మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన వారు చాలామంది ఉన్నారని అన్నారు. జడ్పిటిసి హరిప్రియ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. వెంటనే పాఠశాలకు 10 ఫ్యాన్లు, 5 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, వైస్ ఎంపీపీ కావాలి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, బాబయ్య, పూర్వ విద్యార్థులు మౌలానా, లాల్ కృష్ణ, వెంకట్ రాములు, ఏదిరా కృష్ణ, గోపాల్, వెంకట రామకృష్ణ రెడ్డి, హజి పటేల్, గ్యాంగ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.