Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి సాత్రి సిద్దూ
నవతెలంగాణ-కందుకూరు
కస్తూర్బా పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి సాత్రి సిద్ధూ అన్నారు. ఆదివారం ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాలలో సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో మరుగుదొడ్లకు, తలుపులు లేక విద్యార్థినీలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వాటర్ ఫిల్టర్ ఉన్న ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. తాగునీరు కోసం విద్యార్థినీలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న భవనాన్ని వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.అనంతరం కస్తూర్బా పాఠశాలలో 20 మందితో ఎస్ఎఫ్ఐ కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా పూజిత, కార్యదర్శిగా సౌజన్యలను ఎంపిక చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో శివ, వినోద్ ఎస్ఎఫ్ఐ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.