Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు గణేష్
- పెద్దతుండ్లలో సీపీఐ(ఎం) నిరసన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ధరలను అదుపు చేయకుండా మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు దయ్యాల గణేష్ అన్నారు. పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దతుండ్లలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్న ప్రజలందరికీ స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనం తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఎం చేస్తున్నదని నిలదీశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఉన్న ఉద్యోగాలను తీసే పనిలో బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. వెంటనే డీజిల్, పెట్రోల్, జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలున్నా అప్పుడు డీజిల్, పెట్రోల్ ధరలను స్థిరంగా ఉంటాయని, కానీ ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలను పెరుగుతున్నాయని అన్నారు. ధరలను అదుపు చేయకుంటే రాష్ట్ర వ్యాప్త పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సుందరయ్య, భగత్ సింగ్ శాఖల కార్యదర్శులు భాస్కర్, రమేష్, సీనియర్ నాయకులు సంజీవ, నాయకులు స్కైలాబ్, జంగయ్య, మహేష్, పవన్, గణేష్, మధు, శ్రీకాంత్, పాండు, జంగయ్య, హబ్రహం, రాజు, ధోని తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో...
పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద గ్యాస్ బుడ్డి, ప్లేకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. సామెల్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 12 సార్లు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచడం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలను వీదిన పడేసిందన్నారు. ప్రజలు మోయలేకుండా ఉన్నారన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాడ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యదర్శి ఎల్లేశ, సభ్యులు యాదగిరి, స్వప్న, షేప్పిఉన్నీసా, సంజీవ, దశరథ పీఎన్ఎం జిల్లా కార్యదర్శి జి. గణేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్, సాహెఫ్, తదితరులు పాల్గొన్నారు.