Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
- ఎంకేఆర్ ఫౌండేషన్ ప్రవేశపరీక్షకు భారీగా హాజరైన అభ్యర్థులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రణాళికా బద్ధంగా చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఖాయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నియోజకవర్గ యువత కోసం ఎంకేఆర్ ఫౌండేషన్ ఇవ్వనున్న ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష ఆదివారం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించారు. ప్రవేశ పరీక్షకు భారీ సంఖ్యలో హాజరైన యువతను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వ కొలువుల జాతర మొదలైందన్నారు. స్థానిక యువతకే 95శాతం ఉద్యోగాలు దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకువచ్చి వెంటనే ఉద్యోగాల భర్తీకి టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ సువర్ణావకాశం యువత సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పంతో వెంటనే ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. సురక్షితుకైన అధ్యాపకులచే, తగు వసతులు కల్పించి స్థానిక యువత ఉద్యోగాలు సాధించే విధంగా కార్యాచరణ రూపొందించినట్టు వివరించారు. ఉపాధ్యాయ, టెట్, అభ్యర్థుల ఫలితాలను ఈ నెల 5న ప్రకటించి, 6వ తేదీ నుండి తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల ప్రవేశ పరీక్ష ఫలితాలను ఈ నెల 9న ప్రకటించి, 10వ తేదీ నుండి తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్సీ మురళి, ఎంకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి, ఎంపీపీ కృపేశ్, సీఐలు జగదీశ్వర్, సైదులు, జడ్పీటీసీ జంగమ్మ యాదయ్య, ఎంకేఆర్ ఫౌండేషన్ కార్యదర్శి జేర్కొని రాజు, బద్రీనాథ్ గుప్తా, జానీపాషా, రాజేష్ గౌడ్, నిట్టూ జగదీష్, విజరు, శివ సాయి, మస్కు రమేష్, కాజు మొహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.