Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని , కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పిలుపుమేరకు సోమవారం నాలుగో తేదీ పరిగి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పరిగి నియోజకవర్గంలోని పుడూర్, పరిగి, దోమ, కుల్కచెర్ల, చౌడపూర్, గండీడ్, మహమ్మ దాబాద్ మండల కేంద్రాల్లో టీిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉదయం 9 గంటల నుండి నిరసన దీక్షలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.