Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)నాయకులు డిమాండ్
నవతెలంగాణ-దోమ
రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతున్న డీజిల్, పెట్రోల్, గ్యాస్, మందు గోళీలు, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి, తిమ్మాయిపల్లి, రాకొండ ఆయా గ్రామాలల్లో ఫ్లకార్డుతో నిరసన వ్యక్తం చేశామని మండల సీపీఐ(ఎం) నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రజలకు ఇప్పటికే ఉన్న భారాలు సరి పోకుండా ఉన్నాయన్నట్టు రోజువారీగా పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచుతున్నారని తద్వారా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. వెంటనే డీజిల్, పెట్రోల్, జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను, బస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే కాలంలో సీపీఐ(ఎం) రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు హెచ్.సత్తయ్య, నర్సంపల్లి సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి చిలకమ్మా సత్తయ్య, మహిపాల్ రెడ్డి, సత్యయ్య, శీను, వెంకటయ్య, శేఖర్, రాంచంద్రయ్య, ప్రశాంత్, నర్సింలు, శ్రీనివాస్, రాములు, వెంకటేష్,ఆనంద్, బండ ిజంగయ్య, బండి నరసిములు, బండి వెంకటయ్య, యూ నిస్,బండిరాములు, బండివెంకటయ్య పాల్గొన్నారు.