Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యవర్గ సభ్యులు పి జగన్
- పొల్కంపల్లి గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేంద్రం అడ్డూఅదుపు లేకుండా పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సీపీఐ(ఎం) మండల కార్యవర్గ సభ్యులు పి జగన్ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన 8 యేండ్ల కాలంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్, ధరలు పెంచి పేదల నడ్డి విరిచారని ఆరోపించారు. నిత్యం వినియోగించే పెట్రోల్, డీజిల్, ధరలను విపరీతంగా పెంచారని, గ్యాస్, వంట నూనె నిత్యావసర రాష్ట్రంలో సరుకుల ధరలు కూడా విపరీతంగా పెంచడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యులపై పెను బారం మోపిందన్నారు. ఎన్నికల ముందు మోడీ నల్ల ధనాన్ని వెలికి తీసి ప్రజలకు పంచుతానని నేడు అందుకు విరుద్ధంగా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నదని విమర్శించారు. ఇప్పటికే దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, ధరలు తగ్గించే వరకు ఆందోళనను ఉధృతం చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు సీహెచ్.నర్సింహా, ఎస్డీ ఉస్మాన్, శాఖ కార్యదర్శులు జీ.అశోక్, ఎ.నర్సింహా, పి. వెంకన్న, పి.స్టాలిన్, పీఎన్ఎం మండల కార్యదర్శి పి.ధనేశ్వర్, నాయకులు, నర్సింహా, యాదయ్య, వెంకటేష్, శివ, బాలయ్య, ధనంజీ, కిషన్, దానయ్య, బలరాం తదితరులు పాల్గొన్నారు.