Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతను ప్రోత్సహిస్తున్న నిత్య కషీవలుడు
- ఆపదలో అండగా నిలుస్తున్న నాయకుడు
- జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి కితాబు
నవతెలంగాణ - ఆదిభట్ల
'స్నేహశీలి.. మదు స్వభావి.. ఆపద్బాంధవుడు.. ప్రజాసేవే తన ఊపిరిగా జీవిస్తూ.. నిరంతరం అందరి మన్ననలు అందుకుంటున్న మర్రి నిరంజన్‌రెడ్డి అందరికీ ఆదర్శనీయుడని ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే, జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. మర్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ఎంఎన్ఆర్ ఐపీఎల్ -2 క్రికెట్ టోర్నీ రెండో రౌండ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో కోదండరెడ్డి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ నిర్వ హించడం మర్రి నిరంజన్‌రెడ్డి ఘనతేనని అన్నారు. యువత క్రీడల్లో రాణించేందుకు నిరంజన్ రెడ్డి కషి చేస్తున్నారన్నారని కితాబు ఇచ్చారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఈ ప్రాంతానికి గుర్తింపు తేవాలని సూచించారు. టోర్నీ విజయవం తానికి నిరంతరం కషి చేస్తున్న ఎంఎన్ఆర్ యువసేన టీం సభ్యులు, ఆర్గనైజర్లను ఆయన అభినందించారు. నియోజకవర్గంలో ఎవరికీ ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకోవడంలో నిరంజన్‌రెడ్డి ముందుంటారని అన్నారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ఆపన్న హస్తం అందిస్తున్నా రని కోదండరెడ్డి తెలిపారు. నిరంజన్‌రెడ్డి పేదల పక్షపాతి అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్న నిరంజన్‌రెడ్డికి సముచిత స్థానం తప్పకుండా దక్కుతుందన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇండోర్, అవుట్ డోర్ క్రీడలు నిర్వహించేలా ప్రభుత్వం, క్రీడారంగ నిపుణులతో చర్చించి స్టేడియాలను ఏర్పాటు చేసేవిధంగా కషి చేస్తానని హామీనిచ్చారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తూ వారి ప్రతిభను సాన పెడుతూ క్రీడాకారుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎమ్మెన్నార్ ఫౌండేషన్ సంకల్పం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని వివరించారు. అనంతరం మర్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరి సహకారంతో ఎంఎన్ఆర్ ఫౌండేషన్ సేవలను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. పార్టీలు, కుల, మతాలక తీతంగా అన్నివర్గాల ప్రజలకు అండగా నిలవడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్టు వివరించారు. తదనంతరం మ్యాన్ ఆఫ్‌ద మ్యాచ్ అవార్డు, నగదు అందజేశారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శులు కొత్తకుర్మ శివకుమార్, దండెం రామ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు శంకర్ గౌడ్, ఎంఎన్ఆర్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, ఆదిభట్ల మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మర్రి రాంరెడ్డి, పాండు రంగారెడ్డి, నాయకులు బూపతిగళ్ళ రాజు, మహిపాల్ రెడ్డి, మనోజ్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల క్రికెట్ క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.