Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీసీ చీప్‌కు రేవంత్‌రెడ్డికి రూ.5 లక్షల చెక్కును
- అందజేసిన దండెం రాంరెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
జిల్లా కారగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ఉద్యమంలా సాగుతోంది. టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేట్టారు. టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డిని టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి కలిసి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేసుకున్న కార్యకర్తల ఇన్సూరెన్స్ సభ్యత్వ నమోదుకు సంబంధించిన రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి డిజిటల్ సభ్యత్వాల నమోదుకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యావాదులు తెలిపారు. సభ్యత్వం తీసుకున్న ప్రతిఒక్క కార్యకర్త బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. రెండు లక్షల ఉచిత భీమా అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కార్యకర్తలకు వెన్నంటే ఉంటమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత మూడు పర్యాయాలుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికారంలో లేనందున ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కార్యక్రమంలో పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ దండెం కృష్ణరెడ్డి, నాయకులు తల్లపల్లి కృష్ణ, శ్రీనివాస్ గౌడ్, స్టేట్ కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గుండ్ల వెంకట్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కళ్లెం శ్రీదర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీశైలం యాదవ్, యూత్ కాంగ్రెస్ దేసారం జగన్ మోహన్ గౌడ్, మైనారిటీ అధ్యక్షులు కాసి, మహిళా సురక్ష అధ్యక్షులు దాసరి నర్సింగ్, యాచారం యూత్ కాంగ్రెస్ శేఖర్ యాదవ్, యాచారం మండలం కాంగ్రెస్ ఎస్.టీ.సెల్ ప్రెసిడెంట్ హాతిరం నాయక్, భువనగిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి నర్సింగ్, అబ్బాస్, అఖిల్, ఆదర్శ్, అక్షరు, మనీష్ పాల్గొన్నారు.