Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ నిఖిల
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
జిల్లాలోని నిరుద్యోగ ఎస్టీ యువతీ, యువ కులు ప్రభుత్వం భర్తీ చేయబోయే పోటీ పరీక్షల కు సన్నద్ద మయ్యేందుకు ఉచిత శిక్షణ అందిం చనున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో ఉద్యో గ నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో జిల్లాలో 100 మంది ఎస్టీ నిరుద్యోగులకు ఉచితంగా సంబంధిత పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నిర్ణహించి దన్నారు. ఈ శిక్షణ పరిగి పట్టణ కేంద్రం లోని పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో వచ్చే నెల మే1 నుంచి ప్రారంభమవుతుందన్నా రు. గ్రూప్-4 అభ్యర్థులు కనీసం డిగ్రీ ఉత్తీ ర్ణత పొంది ఉండాలని, 18-47 ఏండ్లు ఉండాలని వార్షిక ఆదాయం రూ2 లక్షల లోపు ఉండాలన్నారు. ఉచిత శిక్షణ కేంద్రాల్లో శిక్షణ తీసుకున్నవారు, ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు, వేరే కోర్సులలో శిక్షణ తీసుకున్నవారు ఈ శిక్షణకు అనర్హులని పేర్కొన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 4 -11వ తేది వరకు వెబ్ సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.