Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
దైవచింతనతో సమాజంలో శాంతి నెలకొంటుందని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. కడ్తాల్ మండలంలోని పెద్ద వేములోని బాయితాం డాలో బానావత్ కుటుంబ సభ్యులు నూతనంగా నిర్మింమ చిన తుల్జాభవాని ఆలయంలో ఆదివారం విగ్రహప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలతో తుల్జాభవాని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆయన మాట్లా డుతూ..సమాజంలో శాంతి నెలకొల్పేందుకు ప్రతి ఒక్క రూ దైవచింతనను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. కార్య క్రమంలో భాగంగా కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించారు. అనంతరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహ కులతో కలిసి ఆయన ప్రారంభించారు. సర్పంచ్ శ్వేతా భూనాథ్నాయక్, ఉపసర్పంచ్ గోపి నాయక్, సీనియర్ నాయకులు లక్ష్మణ్ నాయక్, గాన్సియా నాయక్, శ్రీను నాయక్, బాబులాల్ నాయక్, శంకర్ నాయక్, జవహర్ లాల్ నాయక్, హీరా నాయక్, తులసి రామ్ నాయక్, దేవస్థానం నిర్వాహకులు మంగ్యా నాయక్, అంజ్యా నాయక్, గోపాల్, నరేష్ నాయక్ పాల్గొన్నారు.