Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనలో సీపీఐ(ఎం) వికారాబాద్ జిల్లా కమిటి డిమాండ్
నవతెలంగాణ- వికారాబాద్ రూరల్
పెంచిన పెట్రోల్, డీజల్, గ్యాస,్ విద్యుత్, ఆర్టీసీ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఏం) వికారాబాద్ జిల్లా కమిటి డిమాండ్ చేసింది. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ ప్రధాన కూడలి విగ్రహం వద్ద సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిం చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర ధరలు తగ్గించాలని ప్లకార్డులను ప్రద ర్శిస్తూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) వికారాబాద్ జిల్లా కార్యదర్శి పి మల్లేష్ మాట్లా డుతూ.. రోజురోజుకూ ధరల పెరుగుదల వల్ల పేద ప్రజలు, కార్మి కులు, రైతులు, కష్టజీవులు మూడుపూటలా తిండి తిన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ,రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆర్టీసీ చార్జీలు తగ్గించకుండా ప్రజల పైన భారా లు వేస్తూ పెట్టుబడి దారులకు కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందన్నారు. ప్రజల తరపున పెద్ద ఎత్తున పోరాడు తామని ధరలు తగ్గించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కెవిపిఎస్, డివైఎఫ్ఐ, రైతు సంఘాల నాయకులు ఆర్. మహిపాల్, అశోక్ , సుభాష్, సుదర్శన్, హరికృష్ణ, శ్రీను నాయక్, రాములు, రాజు, శ్రీకాంత్, శంకర్ పాల్గొన్నారు.