Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
అనారోగ్యంతో పాటు ప్రమాదాల బారిన పడి ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి సీఎం సహాయ నిధితో ఆర్థిక భరోసా కలుగుతుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆమనగల్లో స్థానిక నాయకులతో కలిసి ఆయన పలువురు లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోలి మాట్లాడుతూ..వివిధ సందర్భాల్లో ప్రమాదాలకు గురై ప్రయివేట్ ఆస్పతుల్లో చికిత్స పొందిన వారితో పాటు ఆరోగ్యశ్రీ పథకం వర్తించని ప్రతిఒక్కరూ సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా కె.ప్రేమలత వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.21,500ల చెక్కును లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి, ఆమనగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురమళ్ల సుభాష్, టీఆర్ఎస్ పార్టీ తలకొండపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ టి.చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు సాయినాథ్ రెడ్డి, నాగిరెడ్డి, సతీష్, శ్యామ్ రెడ్డి, మహేష్, కొండల్, ప్రశాంత్, శ్రీశైలం, మణి పాల్గొన్నారు.