Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ- తాండూరు
తాండూరు నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో నేడు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన దీక్షలను అంతం చేయాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షలు కొనసాగను న్నాయి అన్నారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రకటించిన యాక్షన్‌ప్లాన్‌లో ఈ కార్యక్ర మాలను చేపడుతున్నారు. వరి ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ తాండూరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో చేపట్టే నిరసన దీక్షలోనియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ ఛైర్మెన్, వైస్ చైర్మెన్, జడ్పీ టీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్ష, కార్యద ర్శులు, మార్కెట్ కమిటీ చైర్మెన్లు, వైస్ చైర్మెన్లు, డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మెన్లు, వైస్ చైర్మెన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్లు, రైతుబంధు మండల, గ్రామ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, ఆయా మండలాల పార్టీ సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్ష కార్య దర్శులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే తెలియజేశారు.