Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సింగపాగ జంగయ్య మాదిగ
నవతెలంగాణ-షాద్‌నగర్
ఈ నెల 5 వతేదీన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని, అలాగే ఆయన విగ్రహ ఆవిష్కరణ దళిత, బహుజన సంఘ నాయకులం తా హాజరుకావాలని టీఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సింగపాగ జంగయ్య మాదిగ అన్నారు. ఆది వారం షాద్‌నగర్ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ దాత ప్రజాసంఘాల ఐక్య వేదిక చైర్మెన్, రంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం నేత మద్దూరి అశోక్‌గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహి స్తారని తెలిపారు. భారతదేశ ఉప ప్రధానిగా అలాగే కేంద్ర రక్షణశాఖ మంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ దాదాపు 40 సంవత్సరాలు పనిచేసి దళిత బహుజన అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేశారని అన్నారు. అలాంటి మహ నీయుని విగ్రహాన్ని షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసుకోవడం గొప్ప విశేశమన్నారు. విగ్రహ ఆవిష్కరణకు దళిత, బహుజన, ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆవుల పెంటయ్య మాదిగ, మైలారం అశోక్ మాదిగ, క మైలారం ప్రకాష్ మాదిగ పాల్గొన్నారు.