Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
ఓటమి ఎరుగని మాజీ ఉపరాష్ట్రపతి, స్వతంత్య్ర సమరయోధులు డాక్టర్ బాబుజగ్జీవన్‌రాం 115వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం నార్సింగి, బండ్లగూడ మున్సిపాలిటీల్లో దళిత సంఘాలు, పార్టీలకతీతంగా వారి విగ్రహాలకు పూలమాలేసి ఘనంగా నివాళ్లు ఆర్పించారు. మంచిరేవుల గ్రామంల్లో బాబు జగ్జీవన్‌రాం యూత్ ఆసోషియోషన్ తరుపున బాబు జగ్జీవన్ రాం విగ్రహానికి కౌన్సిలర్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్, పద్మావీరెడ్డి, నార్సింగి మున్సిపల్ ఆఫీసుల్లో చైర్పర్సన్ దార్గుపల్లి రేఖాయాదగిరి, నార్సింగి బాబు జగ్జీవన్‌రాం భవన్ దళితబస్తీల్లో ఛైర్పర్సన్, వైస్ ఛైర్మెన్, కౌన్సిలర్లు పత్తి శ్రీకాంత్‌రావ్, కె.ఉషారాణి, ప్రతి ప్రవీణ్‌కుమార్, దళిత సంఘాల నాయకులు, ఖానాపూర్ మున్సిపల్ వార్డు ఆఫీసు ముందు మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ మండలాధ్యక్షులు రామేశ్వరం నర్సింహా, మాజీ ఎంపీపీ తలారి మల్లేష్, కోకాపేట్ ప్రధాన చౌరస్తాలో ఎంఆర్పీఎస్, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు, బండ్లగూడ కార్పొరేషన్ హిమాయత్‌సాగర్, దర్గా ఖలీజాఖాన్ ప్రధాన చౌరస్తాల్లో మేయర్ మహేందర్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, హైదర్షాకోట్ గ్రామంలో డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, దర్గా ఖలీజాఖాన్ చౌరస్తాలో టీఆర్ఎస్ అధ్యక్షులు గోకరి సురేష్, మాలకీరత్నం, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భీంరెడ్డి, బాబు జగ్జీవన్‌రావ్ యూత్ కమిటీ అద్వర్యంలో, ఖానాపూర్, కోకాపేట్, వట్టినాగులపల్లి, గౌలిదొడ్డి, మంచిరేవుల, నార్సింగి, కిస్మత్పూర్, హిమాయత్‌సాగర్, హైదర్షాకోట్, గంధంగూడ, బైరాగిగూడ, ఫిరంచెరువు గ్రామాల్లో బాబుజగ్జీవన్‌రాం చిత్రపట్టాన్ని పూలమాలతో ఘనంగా నివాళ్లు ఆర్పించారు. వారి సేవలు నేటి యువత అదర్శంగా తీసుకుని ముందుకు సాగలాన్నారు. కార్యక్రమంలో కమిషనర్లు, మేయర్, ఛైర్పర్సన్, అధికారులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, మాజీ వార్డు సభ్యులు, నాయకులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.