Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సామెల్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి.సామెల్ అన్నారు. వారి కోసం కేటాయించిన చట్టాలు, పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయడం లేదని విమర్శించారు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతిని పురస్కరించుకొని కేవీపీఎస్, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. అంనతరం వారు మాట్లాడుతూ.. రాజ్యాన్ని పరిరక్షణకు కృషి చేసిన యోధుల్లో ఒకరు బాబు జగ్జీవన్‌రామ్ అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపుతున్నాయన్నారు. ఓ వైపు దళితులపై దాడులు చేస్తూనే మరోవైపు దళితులను మధ్య పెట్టేందుకు ఎత్తులు వేస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కలిగిన వారికి కూడా దళితబంధు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సాధారణ వ్యక్తులకు కూడా ఇవ్వడం లేదన్నారు. ఊరికి ఒకరకి, అదికూడా తన పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారన్నారు. ఇదే దళత బంధు అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఏడు సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదన్నారు. ఆ నిధులను దారి మళ్లిస్తున్నారన్నారు. ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు భార్తీ చేయడం ఎన్నడో మరిచిపోయారన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సహకాలు అందజేయడంలో ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తున్నదని ప్రశ్నించారు. వారిలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాల్సి ఉందన్నారు. ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం దళితుల పట్ల వాగ్ధానాలు చేయడమే తప్ప ఆచరణలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. వాటి సాధన కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ మండల కార్యదర్శి మేడిబావి ఆనంద్, టౌన్ కన్వీనర్ వీరేశం, సీఐటీయూ పట్టణ కన్వీనర్ ఎల్లేశ, మండల సీఐటీయూ కన్వీనర్ బుగ్గ రాములు, నాయకులు యాదగిరి, పీఎన్ఎం జిల్లా కార్యదర్శి గణేష్ తదితరులు పాల్గొన్నారు.