Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్ రిపోర్టర్
తెలంగాణ యువతలో సజన శక్తి ఉందని వారు నిబద్ధత, దీక్షతో నూతన ఆవిష్కరణలపై దష్టి వుంచాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. అకాడమీ కార్యాలయం లో స్విస్ ఫెడరల్ యూనివర్సిటీ జూరీష్ లో పట్టభద్రులైన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనాధ్ రూపొందించిన నీరు పారిశుధ్య యంత్రం( వాటర్ పూరిఫైర్) ను అల్లం నారాయణ ఆవిస్కరించి మాట్లాడారు. వెనుకబడిన నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ వ్యాధి కి అలవాలమని ఆ జిల్లా వాసిగా శ్రీనాధ్ పారిశుధ్య యంత్రాన్ని రూపొందించటం అభినందనీయమన్న రు. శ్రీనాధ్ మాట్లాడుతూ ప్రస్తుతం చలామణి లో ఉన్న వాటర్ పూరిఫైర్ లో 50 శాతం నీరు వధా అవుతోందని నీటి లో మినరల్స్ కూడా తగ్గిపోతాయని వీటిని అధిగమించి ఈ నూతన యంత్రాన్ని రూపొందించనని తెలిపారు.