Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు నిలయం
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్
స్థానికులకే 90శాతం ఉద్యోగాలు
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మహేశ్వరం
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు నిలయంగా మారిందని, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. విప్రో గ్రూప్ చైర్మెన్ అజీమ్ ప్రేమ్ జీవితం అందరికి ఆదర్శప్రాయమని ఆయన తెలిపారు. మంగళవారం మహేశ్వరం మండల కేంద్రంలో విప్రో కన్సర్ కేస్ సెంటర్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, విప్రో గ్రూప్ ఫౌండర్ చైర్మెన్ అజీమ్ ప్రేమ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలం గాణ రాష్ట్రం పెట్టుబడులకు నిలయంగా మరిందని ఆయన అన్నారు. మహేశ్వరం విప్రో కంపెనీలో స్థాని కులకే ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అంది స్తుందని ఆయన అన్నారు. విప్రో కంపెనీలో కాలు ష్యం లేకుండా అత్యాధునికమైన జర్మనీ కంపెనీ పెట్టుబడులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఒక కంపెనీ నిర్మించాలంటే ఎంతో వ్యయప్రయాసాలకు భరించి కంపెనీలను నిర్మిస్తున్నా రని ఆయన అన్నారు. మహేశ్వరంలో విప్రో కంపెనీ రావడంతో ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని ఆయన అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లా డుతూ.. ఈ కంపెనీలో స్థానికుల ఉద్యోగావకాశాలు తొంబై శాతం మందికి లభిస్తున్నాయని ఆమె సం తోషం వ్యక్త పరిచారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ డులు పెట్టడానికి అనువుగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టడానికి ఐటీ శాఖ మం త్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. తుక్కుగూడ, రావిరాలలో 97 కంపెనీలను ఏర్పాటు చేసి స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఐటీ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్, జిల్లా కలెక్టర్ అమోరు కుమార్, ఆర్డీవో వెంకటాచారి, విప్రో కంపెనీ సీఈవో వినీత్ అగర్వాల్, టీఎస్ఎస్ ఐసీఎండీ నర్సింహ్మరెడ్డి, తహసీల్దార్ ఆర్పీజ్యోతి, ఎంపీడీవో నర్సింహులు, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్, కేసీతండా సర్పంచ్ మోతీలాల్‌నాయక్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, నాయకులు కూనయాదయ్య, కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.