Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభమైన సమగ్ర సర్వే
- శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రిత్వ శాఖ
నవతెలంగాణ-తాండూరురూరల్
కార్మిక ఉపాధి రంగాలకు సంబంధించిన రూపకల్పన కోసం కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖతో కార్మికుల సమగ్ర సర్వే చేపట్టాలంటూ ఐదు రకాల సర్వేల నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో అందులో మొట ్టమొదటి సర్వే డొమెస్టిక్ సర్వే ప్రారంభం అయ్యింది. సర్వేలో తాండూరు మం డలం గౌతాపూర్ గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నుకుంది. మంగళవారం వికా రాబాద్ జిల్లా లేబర్ బ్యూరో సర్వే ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గౌతాపూర్ గ్రామా నికి వచ్చి సమగ్ర సర్వేను ప్రారంభించారు. సర్వేలో 200 మందిని ఎన్నుకుంటామని ఈ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తా మన్నారు. సర్వే వివ రాలను డ్రైవర్, ఇంటి పని, గ్యాస్ డెలివరీ బారు, గొర్రెల కాపరులు, పశువుల కాపరు,్ల వంటి వారినుండి వివరాలను సేకరి స్తామన్నారు. మంగళవారం 100మంది ద్వారా వివరాలను సేకరించామని మరో 100మందిని ఎంపిక చేసి అనంతరం అందులో నుంచి ర్యాండమ్ సర్వే ద్వారా 12 మందిని ఎంపిక చేసి నివేదిక పంపిస్తామన్నారు. మొదటగా వికారాబాద్ జల్లాలో తాండూరు మండ లం గౌతాపూర్ నవాబుపేట మండలం చించల్ పేట, గ్రామాలను ఎన్నిక చే శామని అన్నారు. సర్వే పూర్తి చేసి నివేదిక అందిస్తామని తెలిపారు.