Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి
నవతెలంగాణ - ఆదిభట్ల
ప్రభుత్వం కల్పిస్తున్న పన్ను రాయితీ తగ్గింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి మంగళ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర, కమిషనర్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్క్యులర్ నెంబర్ 27511/2018/ఎం-1 తేది: 04/04/2022 ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరపు ఇంటి పన్ను మొత్తంలో 5 శాతం రాయితీ పొందే అవకాశాన్ని తెలం గాణ ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ అవకాశం ఏప్రిల్ 30,2022 వరకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఇది కేవలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 ఇంటి పన్ను చెల్లించువారికి మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ పాత బకాయి ఉన్నట్లయితే వారు మొత్తం బకాయి 2021-22 వరకు చెల్లించిన ఎడల 2022-23 సంవత్సరానికి ఐదు శాతం రిటేడ్ రాయితీకి అర్హులు అవుతారన్నారు. ఈ అవకాశాన్ని ఆదిభట్ల మున్సి పాలిటీ ప్రజలందరూ ఆస్తి పన్నులో 5 శాతం రాయితీ తగ్గింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ అమరేందర్ రెడ్డి కోరారు.