Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఉన్న విద్యానగర్ కాలనీ అభి వృద్ధికి కృషి చేస్తానని కౌన్సిలర్ సోనా జైరామ్ నాయక్ అన్నారు. మంగళ వారం స్థానిక నాయకులతో కలిసి వారు కాలనీలో పర్యటించారు. ఒక చోట కాలనీలో నిల్వ ఉన్న మురుగు నీరు వెళ్ళేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. కౌన్సిలర్ సోనా జైరామ్ నాయక్ మాట్లా డుతూ.. కాలనీలో అంతర్గత మురికి కాలువ నిర్మాణంతో పాటు సీసీరోడ్లు, విద్యుత్ దీపాలు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ తదితర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కార్యక్ర మంలో విద్యానగర్ కాలనీ కమిటీ అధ్యక్షుడు యం.ఏ.పాషా, కమిటీ సభ్యులు జి.సుదర్శన్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, వెంక టయ్య, రాములు, మల్లేష్, గిరి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.