Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
కడ్తాల్ మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యులు జహాంగీర్ బాబా తండ్రి కరీం సాబ్ అనారోగ్యంతో బాధపడుతు ఓవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యాట నర్సింహ తదితరులు మంగళవారం ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శిం చారు. అదేవిధంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఢిల్లీ పద్మ కుమా రుడు ప్రదీప్‌ని వారు పరామర్శించారు. కార్యక్రమంలో కడ్తాల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూలశంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంచందర్‌నాయక్, నాయకులు మల్లేష్ గౌడ్, సత్యంయాదవ్ పాల్గొన్నారు.