Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
- సర్పంచ్‌లు చెక్కల చంద్రశేఖర్, కేతావత్ నీలా
నవతెలంగాణ-శంషాబాద్
మండల పరిధిలోని పెద్ద షాపూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో లిమ్స్ హాస్పిటల్ సహకారంతో మంగళవారం నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. పెద్ద షాపూర్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్‌లో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ క్యాంప్ లో సుమారు 1500 మందికి హెల్త్ చేకప్ చేశారు. లిమ్స్ హాస్పటల్ డైరెక్టర్ డాక్టర్ దిద్యాల రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని పెద్ద షాపూర్ సర్పంచ్ చెక్కల చంద్రశేఖర్ , పెద్ద షాపూర్ తండా సర్పంచ్ కేతావత్ నీల నాయక్ ప్రారం బభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత మెగా హెల్త్ క్యాంపులు లిమ్స్ హాస్పిటల్ సౌజ న్యంతో నిర్వహించడం అభినందనీ యమన్నారు. శంషాబాద్ లిమ్స్ యాజమాన్యం సహకారంతో వందలాది మంది ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు చేసి,ఉచితంగా మందులు అందజే యడం అభినందనీయమన్నారు. పెద్ద షాపూర్ తండా యువకులు నేను సైతం టీం సభ్యులు పాలొ ్గన్నారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు ఉచితంగా అన్న దానం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద షాపూర్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, లిమ్స్ వైద్యబృందం డాక్టర్లు స్మిత, విశ్వతేజ, విశ్వనాథ్, గోవర్దన్, నితీష్ ,సంతోష్ సిబ్బంది పాల్గొన్నారు.