Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల హామీల అమలేది?
- సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. రామస్వామి
నవతెలంగాణ-చేవెళ్ల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని విస్మరించాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. రామస్వామి అన్నారు. మంగళవారం చేవెళ్ల మండలంలోని దేవుని ఎర్రవల్లి గ్రామంలో సీపీఐ జెండా ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లా డుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యవసరాల ధరలు పెంచి ప్రజల జీవి తాలతో చెలగాటమాడుతున్నాయని దుయ్యబట్టారు. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు ప్రజలకు సకాలంలో అందడం లేదన్నారు. గత ఎన్నికల్లో నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, మూడెకరాల భూమి ఇస్తానని ఇచ్చిన హామీలు అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శిం చారు. రైతుబంధు పథకం కేవలం టీఆర్ఎస్ నాయకులకే అందుతున్నాయనీ, అర్హులైన పేద లబ్ది దారు లకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగు తుందన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి సత్తిరెడ్డి, వ్యకాసం అధ్యక్షులు మల్లేశ్, మహిళా సంఘం అధ్యక్షురాలు మంజుల, నాయ కురాలు మాధవి, వినోద, నాయకులు మహేందర్, రఘు పాల్గొన్నారు.