Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబ్దిదారులు యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలి
- ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్‌రెడ్డి
- లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ
- దళిత వాడలో సామూహిక భోజనం చేసిన ఎమ్మెల్యే
నవతెలంగాణ- యాలాల
సమాజంలో వర్ణ, వర్గ భేధాలు ఉండొద్దని ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని యాలాల మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎంపీపీ టి.బాలేశ్వర్ గుప్తా, పార్టీ మండల అధ్యక్షులు సి.రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రమేష్‌తో కలిసి ముఖ్య అథితిగా పాల్గొని ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు కావలసిన హక్కులను, అవసరాలను తెలిపిన గొప్ప మహానీయుడు అంబేద్కర్ అన్నారు. మండల కేంద్రంలో దళిత బందు పథకం మొదటి విడత కింద 12 మంది లబ్దిదారులను ప్రభుత్వం ఎంపిక చేసి యూనిట్లను అందజేస్తాన్నారు. యూనిట్లు పొందిన లబ్ది దారులు యూనిట్లను సద్వినియోగం చూసుకోవాలని సూచించారు. ఎంపీడిఓ కార్యాలయంలో 22 మంది కల్యాణలక్ష్మీ పథకం లబ్దిదారులకు చెక్కులను ఎమ్మెల్యే, ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, పార్టీ మండల నూతన అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రమేష్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రం దళితవాడలో ఎమ్మెల్యే సామూహిక భోజనం చేశారు. దళిత బందు పథకం కింద యూనిట్లు పొందిన లబ్దిదారులు వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే, ఎంపీపీలను ఘనంగా శాలువ పూల దండలతో సన్మానించారు. అదే విధంగా మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో నూతన అధ్యక్షులు ఎన్కేపల్లి రవీందర్ రెడ్డిని ఎమ్మెల్యే సన్మానించారు. అలాగే లక్ష్మీనారాయణ పూర్ చౌరస్తాలో చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. యాసంగీ సీజన్ లో రైతులు సాగు చేసిన వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలుకు నిర్ణయం తీసుకున్న సంధర్భంగా సీఎం కేసీఆర్ ్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోవిందమ్మ, ఎంపీడీఓ పుష్పలీల, అధికారులు, సీనియర్ నాయకులు ఎమ్మెల్యే తండ్రి విట్టల్ రెడ్డి, తాండూర్ ఏఎంసీ చైర్మెన్ విట్టల్ నాయక్, వైస్ చైర్మెన్ వెంకట్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు సప్తగిరి గౌడ్, ఆశన్న మెట్లీ, జిల్లా అధ్యక్షులు ఉప్పలి మల్కయ్య, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు యు.బుగ్గప్ప, వీఆర్ఓల సంఘం జిల్లా నాయకులు మలిగేరి రాజు, కేవీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి బస్వరాజ్, యువ నాయకులు జె. శ్రీనివాస్‌గౌడ్, కిష్ణ మెట్లీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.