Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైస్ ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్
నవతెలంగాణ-మహేశ్వరం
గిరిజన తండాలను అభివృద్ధి పథంలో నడిపిస్తాన ని వైస్ ఎంపీపీ సునితాఆంధ్యానా యక్ అన్నారు. గురువారం కొత్వాల్ చెరువు తండాలో ఎస్డీఎఫ్ రూ.50 లక్షల నిధులతో సీసీరోడ్లు, డ్రయినేజీ పనులను సర్పంచ్ మోతీలాల్ నాయక్తో కలిసి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తండాలు అభివృద్ధిలో దూసుకు పోతున్నా యని ఆమె అన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చి తండా ప్రజలకు స్వయం పాలనను అందిస్తు న్నారని ఆమె అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి ల సహకారంతో తండాలను మరింత వేగంగా అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పం చ్ లక్ష్మణ్, వార్డు సభ్యులు సూర్య, లాలూ, రవీందర్ కార్యదర్శి జూచిద్ తండా వాసులు పాల్గొన్నారు.