Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల అధ్యక్షులు వీరేశం
నవతెలంగాణ- కేశంపేట
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఆ పార్టీ మండల అధ్యక్షులు గూడ వీరేశం అన్నారు. కేశంపేట మండలం కోనాయిపల్లి గ్రామంలో మండల మహిళా అధ్యక్షురాలు జూలపల్లి అనసూయ ఆధ్వర్యంలో గురువారం మహిళా గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా బర్కం లలిత, ఉపాధ్యక్షురాలిగా గునమోని అంజమ్మలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు భాస్కర్, నరసింహా రెడ్డి, నరేందర్, కృష్ణయ్య, జంగయ్య, సురేష్, శ్రీనులతోపాటు తదితరులు పాల్గొన్నారు.