Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోటీ పడి అంబేద్కర్‌కు నివాళి
- పల్లె, పట్టణ కేంద్రాల్లో భారీ ర్యాలీలు
- బాణసంచా పేల్చి, నినాదాలతో హౌరెత్తిన సంబరాలు
- ప్రత్యేక వాహనాల్లో భారీ అంబేద్కర్ కటౌట్లు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు రంగారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళ్లులర్పించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ నామస్మరణతో గ్రామీణ, పట్టణ వీధులు హౌరెత్తాయి. భారీ ర్యాలీలు నిర్వహించుకుంటూ జై భీమ్ నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌పై భారీ అంబేద్కర్ కటౌట్‌తో పూలవర్షం కురిపించుకుంటూ ఇబ్రహీంపట్నంలో ప్రదర్శణ నిర్వహించారు.గజమాలతో నివాళ్లులర్పించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి, ఇతర మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ(ఎం), కేవీపీఎస్ ఆధ్వర్యంలో నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థిక, రాజకీయ సమానత్వం వచ్చినప్పుడే అంబేద్కర్ నిజమైన నివాళులర్పించిన వారం అవుతామని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సామెల్ అన్నారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గాలయ్య, జిల్లా అధ్యక్షులు రాములయ్య, జిల్లా నాయకత్వంతో కలిసి నివాళ్లులర్పించారు. బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి తన పుట్టిన రోజును పురష్కరించుకుని ఎంఎన్ఆర్యువసేన ఆధ్వర్యంలో తుర్కయంజాల్ వరకు వేలాది మందితో భారీ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యాంజాల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ గజమాలను క్రేన్‌తో అంబేద్కర్ మెడలో వేసి నివాళ్లులర్పించారు. జైబీం నినాదాలతో ఇబ్రహీంపట్నం పుర వీధులను మారు మోగించారు. తుర్క యాంజాల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు నిర్వహించిన ర్యాలీతో సుమారు మూడు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక తెలుగుదేశం, టీఆర్ఎస్, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా అంబేద్కర్‌కు నివాళులర్పించారు. ఇబ్రహీంపట్నం సాంఘిక సంక్షేమశాఖ గురుకుల కళాశాల విద్యార్థులు బ్యాండ్ మేళాలతో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కు నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో సీపీఐ(ఎం). సీపీఐ, టీడీపీ, బీజేపీ, బీఎస్పీ, టీఆర్ఎస్ పార్టీల నాయకులు తమ సందేశాన్ని ఇచ్చారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు సమిష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నేటికీ కొనసాగుతున్న అంటరానితనం, అస్పశ్యతపై సంఘటితంగా సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.