Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
నవతెలంగాణ-గండిపేట్
ఆపదల్లో ఉన్న అబాగ్యులను కేసీఆర్ సర్కారు అదుకుంటుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్ అన్నారు. అన్నారు. గురువారం నార్సింగి మున్సిపాలిటీ కోకాపేట్ గ్రామానికి చెందిన లక్ష్మీకి కౌన్సిలర్ గంగిడి శివారెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే చేతుల మీదిగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 60 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదపల్లో ఉన్న పేదలను అదుకుంటామన్నారు. కుటుంబాలు అర్థిక స్థితినుండి కోలుకునేందుకు వారికి చేయుతనిస్తూ చేయుతనందిస్తామన్నారు. పేదల కోసం కేసీఆర్ సర్కారు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్న తమ దృష్టికి వస్తే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపల్ వైస్ ప్రసిడెంట్ రామేశ్వరం విశ్వనాథ్, వార్డు అధ్యక్షులు చంద్రశేఖర్, ఎస్సీసెల్ అధ్యక్షులు సురేష్, ప్రభాకర్, లోక్ష్మారెడ్డి, యాదగిరి, సునీల్, గణేష్ శ్రీకాంత్, నవీన్, నాయకులు పాల్గొన్నారు.