Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురష్కరించుకొని ర్యాలీ
- మండల వైద్యాధికారి డాక్టర్ ఉమా దేవి
నవతెలంగాణ-యాచారం
ప్రజలందరూ మలేరియా వ్యాధిపై మరింత అవగాహన పెంచుకోవాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఉమాదేవి కోరారు. సోమవారం యాచారం మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితో ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోమ చిన్నదైన దాని కాటుతో ప్రాణాంతకంగా మారుతుందని గుర్తుచేశారు. ఇంటిచుట్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పరిసర ప్రాంతాలలో నీరు నిలవకుండా చేసుకోవాలని చెప్పారు. ప్రతి శుక్రవారం ప్రజలంతా డ్రైడేను వాడాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యంతో పెద్ద ప్రమాదంలో పడతామని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దోమకాటుకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీలత, సూపర్వైజర్స్, ఏఎన్ఏంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.