Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగులో ఉన్న సాగుదారులు అందరికీ
- కొత్త పాసు పుస్తకాలు అందించాలి
- వ్య.కా.స, కేవీపీఎస్, సీఐటీయూ ప్రజాసంఘాల నాయకులు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు సబ్ డివిజన్ పరిధిలోఉన్న భూ సమ స్యలు పరిష్కరించాలని కోరుతూ, ధరణి పోర్టల్‌ను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ ఫారెస్ట్ భూముల్లో సాగులో ఉన్న రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు అందించాలని, ఇల్లు లేని పేదలందరికీ పట్టాలివ్వాల నిడిమాండ్ చేస్తూ సోమవారం తాండూరు పట్టణ కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో తాండూరు ఆర్డీఓ కార్యాలయం ముం దు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయం లో జూనియర్ అసిస్టెంట్ బాలరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు సీఐటీ యూ జిల్లా అధ్యక్షులు కే.శ్రీనివాసు, వ్యవసాయ కార్మి క సంఘం జిల్లా అధ్యక్షులు యు.బుగ్గప్ప, కేవీపీఎస్ జిల్లా నాయకుడు ఉప్పలి మల్కయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస్స చంద్రయ్య, దళిత సంఘం జిల్లా నాయకుడు కే.చంద్రయ్య, బీసీ సంఘం నాయకుడు అబ్బని బసయ్యలు మాట్లాడుతూ..ధరణి సమస్య మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. భూ బదలాయింపులో గాని, విరాసత్, ముటేషన్, తదితర సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నారని అన్నారు. పరిష్కరించాల్సిన ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నా ధరణి పొటల్ వెంటనే రద్దు చేయా లన్నారు. ప్రభుత్వ, ఫారెస్ట్ భూముల్లో అనేక ఏండ్లుగా సాగుచేస్తున్న రైతులకు కొత్త పాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందట్లేదని కాబట్టి సాగులో ఉన్న రైతులం దరికీ కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వివిధ గ్రామాల్లో పేదలకు ఇండ్ల స్థలాల కోసం యాలాల్, తాండూరు పట్టణంలోని వాల్మీకినగర్‌లో స్థలాలు కేటాయించిందని కానీ ఇప్పటివరకు వాటికి సంబంధించిన పత్రాలను అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల న్నారు. లేనిచో రైతులు,పేదలను సమీకరించి ఆందో ళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రమేష్, రాజు, నరేష్, మంజుల స్వప్న, రాములు, పుష్ప, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.