Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ కథనానికి స్పందన
- కదిలిన రెవెన్యూ యంత్రాంగం
- 654 సర్వేనంబర్‌లో ఆక్రమణల గుర్తింపు
- సర్వే చేసి హద్దురాళ్లు పాతిన రెవెన్యూ అధికారులు
- సర్వేకు ముందు కబ్జా కాలేదని వాదించిన రియల్టర్లు
- సర్వే అనంతరం అక్కడి నుంచి జారుకున్న వైనం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
'ప్రభుత్వ భూమి కబ్జా' కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. దండుమైలారంలోని సర్వేనంబర్‌లో 654లో కబ్జా చేసినట్టు తేలింది. సర్వే చేసి హద్దురాళ్లు పాతారు. సర్వే చేయడా నికి ముందు కబ్జా చేయలేదని వాదించారు. చివరకు కబ్జా గురైనట్టు తేలడంతో అక్కడి నుంచి జారుకున్నారు. ఇది దండుమైలారంలో చోటు చేసుకున్న వైనం.
ప్రభుత్వ భూముల అమ్మకానికి గురువుతు న్నాయని, రియల్టర్లు కొనుగోలు చేసిన ప్రభుత్వ భూముల్లో అక్రమార్గంలో రోడ్లు, విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారని నవతెలంగాణ లో సోమవారం వార్తా కథనాన్ని ఇచ్చింది. ఈ వార్త కథనానికి స్పందించిన రెవెన్యూ అధికా రులు కదిలారు. ఆర్ఐ క్రిష్ణతో పాటూ సర్వేయర్ పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది కబ్జాకు గురైనట్టు భావిస్తున్న సర్వేనంబర్ 654 లో సర్వే నిర్వహించారు. ప్రభుత్వ సర్వే నంబర్ల ఆధారంగా సర్వే చేశారు. అయితే దండుమైలా రం-నెర్రపల్లి బీటీ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ సర్వే నంబర్లోని భూమి కబ్జాకు గురైనట్టు తేల్చారు. బీటీ రోడ్డు నుంచి వెంచర్ వరకు 40పీట్ల విస్తీర్ణంలో రోడ్డు వేసినట్టు తేల్చారు. కేవలం 12 ఫీిట్ల రోడ్డు మాత్రమే ఉందని, ఇంత పెద్దమొత్తంలో రోడ్డు వేయడం సరికాదని భావించిన సర్వేయర్ తేల్చడంతో ఆర్ఐ క్రిష్ణ ఆ రోడ్డును మూసి వేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ సిబ్బందితో రోడ్డు మార్గాన్ని మూసి వేయనున్నట్టు తెలిపారు. అంతే కాకుండా వెంచర్ యజమానులు కూడా తన భూమిలో కొంత భాగాన్ని కబ్జా చేసినట్టు గుర్తిం చారు. అందుకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నారు. మొత్తంగా ప్రభుత్వ భూములను అక్రమార్గంలో కబ్జాలకు పాల్పడితే చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు.