Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనసూయ
- సీబీఐటీ కాలేజీలో అవగాహన
నవతెలంగాణ-గండిపేట్
మహిళలు, పిల్లలకు మరింత రక్షణ కల్పిస్తామని సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు అనసూయ అన్నారు. సోమవారం గండిపేట్ సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థు లకు అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలకు, పిల్లల భద్రతా కోసం రాష్ట్ర ప్రభుత్వం మరింత రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేదింపులు, వరకట్నం, అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీల పట్ల ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. బ స్టాండ్ల్లో, స్కూల్, కాలేజీల్లో, రైల్వేస్టేషన్లు నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఫిర్యాదు చేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. నగరంలో మహిళల పట్ల జరిగే దాడులను అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. పిల్లల రవా ణా ఇతర ప్రాంతాలకు తరలించే ముఠాలపై నిఘా ఉంచుతామన్నారు. ఎలాంటి సమస్యలైన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో నార్సింగి ఎస్ఐ బాల్రాం, పోలీసు అధికారులు, కాలేజీ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.