Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
నవతెలంగాణ - బొంరాస్ పేట్
సీఎం సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని రేగడి మైలారం గ్రామానికి చెందిన చంద్రయ్యకు సీఎం సహాయనిధి ద్వారా రూ.1 లక్ష 50 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి సీఎం సహాయనిధి ఎంతో దోహద పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.