Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
దిశ దినపత్రిక శేరిలింగంపల్లి ఇన్చార్జీ తుడుం భూమేష్పై కేపీహెచ్‌బీ పోలీసులు అనుచితంగా వ్యవ హరించిన తీరుపట్ల నిరసన వ్యక్తం చేసిన శేరిలింగంపల్లి జర్నలిస్టులు సోమవారం మాదాపూర్ డీసీపీ శిల్పవల్లికి ఫిర్యాదు చేశారు. కేపీహెచ్ బి పోలీసుల వైఖరిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధంలేని కేసులో భూమేష్‌ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఒక ఉగ్రవాది మా దిరిగా అతని ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించి, మరీ అతన్ని ఇంటిలో నుండి కిడ్నాప్ చేయ డం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలు రాయడమే నేరమనే విధంగా రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీ సులు జర్నలిస్టుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమ యిన జర్నలిస్టులను అణచివేసేందుకు తీవ్రంగా ప్రయ త్నిస్తున్నారని మండిపడ్డారు. ఇదే విధంగా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టులం ఏకమై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదు సమర్పించిన వారిలో జర్నలి స్టులు లక్ష్మీనారాయణ, కొండా విజరు కుమార్, వినయ కుమార్ పుట్ట, మల్లేష్‌గౌడ్, రాజేష్, అనిల్, వరుణ్, సాల్వేడర్ టిల్లు, హేమంత్ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బస్వరాజు, లక్ష్మణ్, వెంకటేశ్, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్ప్రసాద్, యాకయ్య, హరికృష్ణ, సాగర్‌రెడ్డి, కొండల్ రెడ్డి, అశోక్ రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.