Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ- మియాపూర్
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని టీఆర్ ఎస్ సాధించిన విజయాలకు సూచికగా ఒక పండు గ లా జరుపుకోవాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. శేర్లింగంపల్లి ముఖ్య పార్టీ కార్యకర్తల సమావేశం మియాపూర్ డివిజన్ పరిధిలోని నరేన్ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే గాంధీ ప్రసంగించారు. టీఆర్ఎస్ చేసిన ఎన్నో ఉద్యమాలు పోరాటాల ఫలి తంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని సాధించుకున్న రాష్ట్రంలో రెండు సార్లు అధికారం చేపట్టి తెలంగాణ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింద న్నారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారిం దని, నేడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే విధంగా సీఎం కేసీఆర్ పరిపాలనకు నిదర్శనమన్నా రు. టీఆర్ఎస్ ఆవిర్భవించి 21 వసంతాలు పూర్తి చేసుకొని 22వ వసంతాలకు అడుగుపెడుతున్న సందర్భంగా టీఆర్ఎస్ సాధించిన విజయాలను సూ చికగా ఒక పండుగాల జరుపుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్లలో,ప్రతి కాలనీ,బస్తిల్లో టీఆర్ఎస్ జండా ఆవిష్కరించాలని, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ అభిమానులు ప్రతిఒక్కరూ తమ ఇంటి పైన జండా ఆవిష్కరించి తమ అభిమా నాన్ని చాటుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, హామీద్ పటేల్ రాగం నాగేం దర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్, నార్నె శ్రీనివాస రావు, పూజిత జగదీశ్వర్ గౌడ్, సింధు ఆదర్శ్ రెడ్డి, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, డివిజన్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.