Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరిగేషన్ ఏఈ సిద్దార్
నవతెలంగాణ-దోమ
గ్రామాలలోని చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఇరిగేషన్ ఏఈ సిద్దార్ అన్నారు. సోమవారం దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామం లోని చెరువును ఆయన సందర్శించి పరిశీ లించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డు తూ.. చెరువుకు సంబంధించిన తూములు గత కొంత కాలంగా లీకేజీలు అవుతున్నాయని గ్రామస్తులు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ మేరకు చెరువును సందర్శించి లీకేజీలు పరి శీలించి వాటి మరమ్మతుల కోసం సర్వే చేపట్టా మని అన్నారు. సర్వే అనంతరం ఉన్నతాధికా రులకు నివేదికలను అందజేస్తామని తెలిపారు. అధికారుల నుండి నివేదికలు రాగానే చెరువు తూముల పనులను ప్రారంభించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే చెరువుకు కెనాల్స్ లేకపోవడంతో ఆయా కట్టు రైతులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని అన్నారు. తప్పనిసరిగా కెనాల్స్ ఏర్పాటు చేయా ల్సి అవసరముందన్నారు. అందుకోసం నూతన కెనాల్స్ ఏర్పాటు కోసం నివేదికలను తయారు చేసి పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రుక్క య్య గాడ్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.