Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్, సీఐటీయూ, వ్య.సా.కా. సంఘం. జిల్లా నాయకులు
నవతెలంగాణ- యాలాల
యాలాల మండలంలోని నాగసమందర్ గ్రామంలో దళిత మహిళపై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన అగ్రకులస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కెేవీపీఎస్ అధ్యక్షులు ఉప్పలి మల్కయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప సోమవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ.. డప్పు సుగుణమ్మ తన సొంత పొలంలో జేసిబి సహాయంతో వరాలు మట్టి పనులు చేస్తుండగా అదే గ్రామానికి చెందిన అగ్రకుల పెత్తందారుడు కొండేటి లాల్ రెడ్డి సుగుణమ్మను ఆమె మరిది దేవరాజును కులంపేరుతో దూషించి వారిపై దాడి చేశాడు. ఈ చర్యలకు పాల్పడిన అగ్రకుల పెత్తందారులపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మరుసటి రోజు రాత్రి సమయంలో పెద్దల సమక్షంలో మాట్లాడదామని దేవరాజ్‌ను పిలిచి అతనిపై దాడికి యత్నించిన రుక్మారెడ్డిపై కూడా గట్టి చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. ఆ దళిత కుటుంబానికి పోలీస్ శాఖ రక్షణ కల్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు డప్పు మహేందర్, బాదితులు డప్పు సుగుణమ్మ, దేవరాజ్ పాల్గొన్నారు.