Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడే సందర్భంగా ఉద్యోగ కార్మిక గౌరవ సన్మాన సమ్మేళనం
నవతెలంగాణ-తాండూరు
మేడే సందర్భంగా మేడే పోస్టర్ను తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో విడుదల చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో సోమవారం టీఆర్ఎస్ కార్మిక విభాగం తాండూ రు నియోజకవర్గం అధ్యక్షులు గోపాల్ తో కలిసి మేడే పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినమ న్నారు. మేడే.. శ్రామికుల జీవితాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన శుభదినమని అన్నారు. కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ అన్నారు. 30 శాతం పీఆర్సీ అందించిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల కండ్లల్లో ఆనందం నింపింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నా రు. భారీ నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురి స్తున్నాయని అన్నారు. అప్పట్లో చికాగో నగరంలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారన్నారు. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి (రెస్టు), ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారని అన్నారు.పెట్టుబడిదారీ వ్యవ స్థ వున్నంతవరకు శ్రమదోపిడీ, ఎక్కువ పనిచేయిం చుకో వడం సర్వసాధారణమని అన్నారు. ప్రపంచీకరణ వలన వందేండ్ల కిందట సాధించిన కనీస డిమాండ్లు కూడా ఈనాడు అమలుకు నోచుకోవడంలేదన్నారు. మే డే ఉత్సవాలు పురస్కరించుకొని మే1న ఉదయం 10 గంటలకు తాండూరు పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్లో జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.