Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
దళితబంధు రాజకీయ నాయకులకే కాకుండ పేద ప్రజలకు అందించేలా ప్రభుత్వం కృషి చేయాలని బీజేపీ దోమ మండల అధ్యక్షుడు శేరీరాంరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో పత్రికల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అందాల్సిన దళితబంధును ఎమ్మెల్యే అధికార పార్టీ ఎంపీ టీసీలు, సర్పంచులు. వారికి అనుకూల నాయకులకే మొదటి ప్రాధాన్యతను ఇచ్చి దళితబంధులను అందిస్తున్నారని ఆరోపించారు. మండలంలో పేద దళితులు చాలా మంది ఉన్నారని వారందరిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నా రు. అధికార పార్టీ నాయకులకు ఇస్తున్న దళితబంధును రద్దు చేసి పేదలకు అందించేలా ఎమ్మెల్యే కృషి చేయాలని ఆయన కోరారు.