Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క సీసీ కెమెరా వందమంది
- పోలీసులతో సమానం : ఎస్ఐ రమేష్
నవతెలంగాణ- కొడంగల్
నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాలు కీలకం అని ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని ఎస్ఐ రమేష్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై గ్రామ ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాలు చాలా కీలకంగా పనిచేస్తాయని అన్నారు. గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి తమ గ్రామాలలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఒకవేళ దొంగతనం జరిగినా సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టినట్టు తెలిపారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసే విధంగా దాతలు ముందుకు రావాలని కోరారు. నేరాలను అదుపు చేయడం, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.