Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి
- సమస్యలు వెంటనే పరిష్కరించాలి
- తొమ్మిదో వార్డు సభ్యురాలు గంపెల్లి లక్ష్మమ్మ
నవతెలంగాణ-మంచాల
మండల పరిధిలోని లోయపల్లి గ్రామ పంచాయతీ తొమ్మిదో వార్డు సమస్యల నిలయంగా మారిందని వార్డు సభ్యులు గంపెల్లి లక్ష్మమ్మ అన్నారు. బుధవారం ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ మండల పరిధిలోని లోయపల్లి గ్రామంలో తొమ్మిదో వార్డులో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు, అండర్ డ్రయినేజీ లేక కాలనీవాసులు అనేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ కాలనీ గ్రామానికి చివరగా ఉండటం తో గ్రామంలోని మురుగు నీరంతా ఈ కాలనీ వరకు వచ్చి నిలచిపోతుందన్నారు. ఈ మురుగతో దుర్గం ధం, దోమల బెడద అధికమవుతోందనీ, దీంతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్గంధంతో అనేక అనార్యోగ సమస్యలు కాలనీవాసులు ఎదు ర్కొంటున్నారని వివరించారు.అంతేకాకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చెత్త సేకరించే ట్రాక్టర్ కూడా తొమ్మిదో వార్డుకు రావడం లేదన్నారు. ఈ సమస్యల వల్ల 9వ వార్డు ఎస్సీ కాలనీ చెత్త చెదారంతో, మురుగు నీరుతో సమస్యల వలయం గా మారిందన్నారు. పలు సమస్యలపై పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు విన్నవించుకున్నా, పట్టించు కోవడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, తొమ్మిదో వార్డు ఎస్సీ కాలనీ సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనియేడల సమస్యల పరిష్కారం కోసం పై అధికారుల దృష్టికి తీసుకెల్తామని హెచ్చరించారు.