Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్
నవతెలంగాణ-పరిగి
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు.గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గిరిజన రిజర్వేషన్ సాధనలో భాగంగా చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా బుధవారం గిరిజన విద్యార్థి సంఘం నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులకు రిజర్వేషన్ 6 నుంచి 12 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన ముక్తి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పాత్లావత్ గట్యా నాయక్,బహుజన ముక్తి పార్టీ వికారాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి హరి నాయక్, నాయకులు ప్రకాశ్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం తాలూకా అధ్య క్షులు జరుప్ల శ్రీను నాయక్, శ్రీకాంత్ నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.