Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మణికొండ
మణికొండ మున్సిపల్లోని పలు అభివృద్ధి పనులపై చైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ నరెందర్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటుచేసి పలు అంశాలు ఆమోదం తెలిపారు. అందులో బాగంగా మురికి కాలువల నిర్మాణానికి 75 లక్షలు, రోడ్ల నిర్మాణానికి 238 లక్షలు, హరితహరానికి 270 లక్షలు, రోడ్ల ప్యాచ్ వర్క్ కోసం 160 లక్షలు, పార్క్‌ల అభివృద్ధి పనుల కోసం 50 లక్షలు , సాలిడ్ వేస్ట్ మేనేజమెంట్ 220 లక్షలు ఇతరములు 259 లక్షలు మొత్తం 12 కోట్ల 72 లక్షల పనులకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.ఫాల్గుణ్ కుమార్, డీిఈదివ్య జ్యోతి, ఎఈఈ సాయి మౌనిక, మేనేజర్ మల్లారెడ్డి, కౌన్సిలర్స్, కో ఆప్షన్ మెంబర్స్, వాటర్ వర్క్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.