Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ అధికారి పద్మావతి
నవతెలంగాణ - బొంరాస్‌పేట్
పీఎం కిసాన్‌కు రైతులు అందరూ తప్పకుండా ఆధార్ కార్డుకి( ఈకేవైసీ) ఫోన్ నంబర్ అనుసం ధానం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి పద్మావతి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో రైతులకు దీనిపై అవగాహన కల్పించారు. ఆధార్ అనుసంధానం చేసుకోవటానికి గడువు చాలా తక్కువగా ఉండటం వలన రైతులు అందరూ వెంటనే దగ్గరలోని మీసేవ కేంద్రాలు, లేదా ఆధార్ మిని బ్యాంక్‌ల ద్వారా అనుసంధానం చేసుకొనే సౌలభ్యం ఉన్నందున వెంటనే ఈకేవైసి చేసుకోవాలని సూచించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్బిఐ ఫీల్డ్ అధికారి హరి కిరణ్ కిసాన్ క్రెడిట్ కార్డుపై రైతులకు వివరించారు. క్రాప్‌లోన్ తీసుకున్న ప్రతి రైతూ కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవాలని, దాని వలన రైతు ప్రమాధవ శాత్తు మరణిస్తే బ్యాంక్ నుంచి రూ.2 లక్షలు యాక్సిడెంట్ పాలసీ వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు ఇసాక్ హెరాల్డ్, మొయినుద్దీన్, రేణుకా, భార్గవి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.