Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఏఓ బాలాజీ ప్రసాద్
నవతెలంగాణ- కొడంగల్
మట్టి పరీక్ష పంటలకు రక్ష అని వ్యవసాయ అధికారి ఎం ఏవో బాలాజీ ప్రసాద్ అన్నారు. కొడంగల్ మండలం రాళ్ళపల్లి రైతు వేదికలో బుధవారం రైతులకు మట్టి నమూనా ఆవశ్యకత గురించి అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కో భూమికి ఒక్కో లక్షణం ఉంటుందని, అన్నింటికీ ఒకే రకమైన ఎరువులు పనికిరావని, భూసార పరీక్షలు చేయిస్తే అవసరమైన ఎరువులు ఏమిటో తెలుసుకోవచ్చని రైతులకు సూచించారు. భూసార పరీక్షలు చేయించుకోవడం వలన వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుందన్నారు. ఎక్కువ దిగుబడి వచ్చే లాభాలు గడించొచ్చని తెలిపారు. ఎక్కువగా ఎరువులు వాడటం వలన భూమి నిస్సారం అవుతుందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి పంటలకు పనికిరాకుండా పోతుందన్నారు. భూమిలో ఏఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు అవసరం అన్నారు. భూసార పరీక్షల ఆధారంగా సాగు చేయాలని సూచించారు. సాగు భూమి నుంచి తీసిన మట్టి నమూనా సేకరణకు మే నెల అనువైనది అన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమేష్‌రెడ్డి, ఏఈఓ సుమ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చెన్న బసవ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.