Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫస్ట్ క్లాసులో పాస్అయ్యే విద్యార్థులకు ప్రోత్సాహకాలు
- మాజీ సర్పంచ్ రాయికంటి విజరు కుమార్
నవతెలంగాణ-యాచారం
పదో తరగతి విద్యార్థులు చదువులో పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని మాజీ సర్పంచ్ రాయికంటి విజరు కుమార్ సూచించారు. బుధవారం యాచారం మండల పరిధిలోని నంది వనపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఉన్నంతవరకు విద్యార్థులకు అల్పాహారం అందిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా విజరు కుమార్ మాట్లాడుతూ పదవ తరగతిలో ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించిన విద్యార్థికి మొదటి బహుమతి రూ.26111, రెండో బహుమతి రూ.5555, మూడో బహుమతి రూ.2555లను ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. విద్యార్థులంతా బాగా చదువుకుని, ఊరి పేరు మండలంలో ముందు ఉంచాలని కోరారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఒక లక్ష్యంతో కష్టపడి చదవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు గోగికర్ రమేష్, కొండాపురం శ్రీనివాస్, గుణముని రాఘవేందర్, పెరుమాండ్ల విక్రమ్, సామ సంతోష్, సురేష్, వార్డు సభ్యులు గడ్డం దయాకర్, సామ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.